ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చే చాలామంది సినీ తారలు, ప్రముఖులు.. కేన్స్‌లోని ‘హోటల్ మార్టినెజ్’లో దిగేందుకే ఆసక్తి చూపిస్తుంటారట. విలాసవంతంగా, ఆర్ట్ డెకో శైలిలో ఉండే ఈ హోటల్లోని బాల్కనీ నుంచి సముద్రం అద్భుతంగా కనిపిస్తుందట. అందుకే ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో ఇక్కడ ఒక రోజు బస చేయడానికి గరిష్ఠంగా రూ.8.6 లక్షలైనా చెల్లించడానికి వెనుకాడరని చెబుతారు.