నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ‘NBK-111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయినట్లు సంగీత దర్శకుడు తమన్ అప్డేట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుంది.