ప్రముఖ నటుడు బాబు మోహన్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన తన కొడుకును తలచుకుని బాధపడ్డాడు. తన కొడుకు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న టైమ్‌లో స్పీడ్‌గా బైక్ నడపడం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించడని తెలిపారు. ఈ బాధ తనకు జీవితాంతం ఉండిపోతుందని ఎమోషనల్ అయ్యాడు.