దర్శకుడు వెంకీ కుడుములతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా దివంగత నటి ప్రత్యూష జీవితంగా ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రష్మికకు మేకర్స్ కథను వినిపించగా.. ఆమె ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.