నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కలిసి నటించిన మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. NOV 7న రిలీజైన ఈ సినిమా హిట్ అందుకుంది. తాజాగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ.6.5 కోట్లు కాగా .. ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.7 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించాడు.