ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నాడు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో భాగంగా అతడిని విచారణకు హాజరు కావాల్సిందిగా సీఐడీ పది రోజుల క్రితం నోటీసులు పంపింది. ఇందులో భాగంగా ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు. నిన్న హీరో విజయ్ దేవరకొండను కూడా సీఐడీ విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.