జూ.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో నీల్ స్పెషల్ గెస్ట్ రోల్‌ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటి కాజోల్‌ను సంప్రదించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 జూన్ 25న విడుదలవుతుంది.