‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్స్‌లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే అక్కడి ఉత్తర తీరంలో భూకంపం రావడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి స్పందించాడు. ప్రభాస్ క్షేమంగా ఉన్నాడని తెలిపాడు. ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.