కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సింగర్ చిన్మయి సంచలన పోస్ట్ పెట్టింది. ‘జానీ కేసు క్లిష్టమైంది. సెక్సువల్‌గా హెరాస్ చేయడమే కాకుండా అది ఇద్దరి అంగీకారంతో జరిగిందంటూ కొందరు సమర్ధించుకుంటారు. అతనికి పరిశ్రమలో ఉన్న పలుకుబడి కారణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మాయి విజయం సాధించాలని కోరుకుంటున్నా. నిందితుడిని శిక్షించి ఆమెకు న్యాయం చేయాలి’ అని పేర్కొంది.