మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. కొన్ని రోజుల నుంచి ఈ మూవీలో ఆరుగురు హీరోయిన్లు అంటూ వస్తోన్న వార్తలపై రవితేజ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి ఫేక్ అని స్పష్టం చేసింది. దయచేసి అభిమానులు ఇలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఈ మూవీ అధికారిక అప్డేట్లను మాత్రమే షేర్ చేయాలని కోరింది.