తన కుమారుడు అహాన్ శెట్టిపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి చెప్పాడు. అతని కెరీర్ను దెబ్బతీయడానికి పలువురు ప్రయత్నిస్తున్నారని, అహాన్ భవిష్యత్తును నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు. కాగా, అహాన్..సెట్లో అధిక సౌకర్యాలు కావాలని కోరుతున్నాడని, అతని ప్రవర్తన ఇబ్బందిగా ఉందని పలువురు చెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి.