ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ‘ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహరాజ్’ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శివాజీ తల్లి పాత్రలో షెఫాలీ షా నటిస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీని సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.