మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కొత్త లోక’కు సీక్వెల్ రాబోతుంది. ఇందులో దుల్కర్, టోవినో థామస్ కీలక పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి భాగం కానున్నట్లు దుల్కర్ ప్రకటించాడు. తన నాన్నతో చేస్తున్న మొదటి సినిమా ఇదేనని, ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నాడు.