సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి ‘SSMB 29’ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ పాత్రలో కనిపించనున్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.