ఓ ప్రేమకథ చిత్రాన్ని తెరకెక్కించడానికి తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం విజయ్ సేతుపతి, సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇందుకు విజయ్, పల్లవి కూడా ఓకే చెప్పారట. 2026 జనవరిలో ఈ మూవీపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు, ఏప్రిల్లో దీని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.