ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా రూ.23.30కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు.