రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ వేయనున్నట్లు సమాచారం. ఈ సెట్లో ప్రభాస్‌పై ఎంట్రీ సాంగ్‌ను షూట్ చేయడంతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.