TG: రాష్ట్ర పోలీసులకు మూవీ పైరసీ వెబ్ సైట్ IBOMMA హెచ్చరికలు జారీ చేసింది. తమ వెబ్సైట్ను బ్లాక్ చేస్తే, ఐదు కోట్ల మందికి పైగా సమాచారం తమ వద్ద ఉందని హెచ్చరించింది. మీడియా, OTT, హీరోల ఫోన్ నెంబర్లు బయటపెడతామని షాకింగ్ రివీల్ చేసింది. ఇండియా మొత్తం తమకు సపోర్టు ఉందని.. తమ సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులు కనిపెట్టలేరని స్పష్టం చేసింది.