బాలీవుడ్‌పై మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్కడ స్టార్ అని నిరూపించుకోకపోతే.. వాళ్లు మనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని.. సరిగ్గా పట్టించుకోరని చెప్పాడు. అక్కడ లగ్జరీ కారులో వస్తేనే స్టార్ అని అనుకుంటారని, అది దురదృష్టకరమని అన్నాడు. కానీ మలయాళ సినీ పరిశ్రమలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని, లగ్జరీకి ప్రాధాన్యం ఇవ్వరని పేర్కొన్నాడు.