వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఈ సినిమాల టైటిల్స్ అన్నింటిని కలిపి ఒకే సెంటెన్స్గా మార్చి పలువురు SMలో వైరల్ చేస్తున్నారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి అనగనగా ఒకరాజు మన శంకరవరప్రసాద్ గారు రాజాసాబ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో నెటిజన్లు ఇది ఒక స్టోరీలైన్లా చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.