రెండు కిడ్నీలు డ్యామేజ్ కావడంతో టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ మరణించిన విషయం తెలిసిందే. ఎన్నో సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో వెంకట్ మెప్పించాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. రోజుకు వెంకట్ రూ.30 వేలు రెమ్యూనరేషన్ తీసుకునేవాడని సన్నిహితులు తెలిపారు. అయినప్పటికీ డబ్బులు పొదుపు చేయకపోవడంతో అతని పరిస్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు.