మనమెప్పుడూ చట్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని హీరో రానా దగ్గుబాటి అన్నాడు. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసు తదితర అంశాలను ఉద్దేశించి రానాకు ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి జవాబు చెబుతూ.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని రానా తెలిపాడు. ప్రొడక్ట్ క్వాలిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే దేనికైనా తాను ప్రచారం చేస్తానని చెప్పాడు.