‘రాజాసాబ్’ మూవీ వాయిదా పడనున్నట్లు, ఆ మూవీ మేకర్స్ ఓ బాలీవుడ్ సంస్థకు క్లియర్ చేయాల్సిన ఫైనాన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నిర్మాత విశ్వప్రసాద్ స్పందించాడు. ‘రాజాసాబ్ మేకింగ్‌కు తీసుకున్న పెట్టుబడులను మేము క్లియర్ చేశాం. అలాగే వడ్డీని త్వరలోనే క్లియర్ చేస్తాం’ అని తెలిపాడు. ఇక ఈ సినిమా 2026 JAN 9న విడుదలవుతుంది.