‘కాంతార 1’ వివాదంపై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్పందించాడు. కేవలం రిషబ్ శెట్టి అద్భుతమైన ప్రదర్శనను హైలైట్ చేయడమే తన ఉద్దేశమని, ఆ సంఘటన వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే తాను నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం, నమ్మకాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని పేర్కొన్నాడు.