సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్రంలో మహేష్ ఏకంగా ఐదు పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, సూపర్ స్టార్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగడం ఖాయం. కాగా, ఈ సినిమాలో మహేశ్.. రాముడి పాత్రలో కనిపించనున్నారని రాజమౌళి ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.