బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో దర్శకుడు బుచ్చిబాబు సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం బుచ్చిబాబు.. రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు.