దుల్కర్ సల్మాన్, దర్శకుడు సెల్వరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘కాంత’. దిగ్గజ నటుడు త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా రాబోతున్న ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ త్యాగరాజ మనవడు చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు. తాత చరిత్రను తప్పుగా చూపించారని, ఈ మూవీకి సంబంధించి తమ అనుమతి తీసుకోలేదని ఆరోపించాడు. దీనిపై ఈనెల 18లోగా వివరణ ఇవ్వాలని దుల్కర్, సెల్వరాజ్‌కు కోర్టు ఆదేశించింది.