బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్కి అరుదైన గౌరవం దక్కింది. ‘పాలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్’ స్థాపించిన ఆమె.. దాని ద్వారా 3,800 మందికిపైగా నిరుపేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించింది. ఇందుకుగానూ ముచ్చల్ గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇదే విషయంలో ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.