బెట్టింగ్ యాప్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ సీఐడీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గతంలో తాను బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌లో పాల్గొన్నానని.. ఆ తర్వాత వాస్తవాన్ని గ్రహించి ప్రమోషన్స్ చేయట్లేదన్నారు. అలాగే, బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్దని యువతకు విజ్ఞప్తి చేశాడు. ‘తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే’ అని తెలిపాడు.