సోషల్ మీడియాలో వైరస్ అవుతున్న తన డీప్ ఫేక్ వీడియోలపై నటి రుక్మిణీ వసంత్ బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వీడియోలను వైరల్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్య హీరోయిన్లకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు, అమ్మాయిలకు ఎదురవుతోందన్నారు. ‘AI’ని ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, క్షోభకు గురి చేయడానికి వాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.