TG: గ్లోబల్ సమ్మిట్‌కు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘విభిన్న రంగాలకు చెందిన దిగ్గజాలు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి దిగ్గజాల మధ్య నేను ఉండటం నిజంగా గొప్ప గౌరవం’ అని పేర్కొన్నారు. HYDను గ్లోబల్ సినిమా హబ్‌గా చేయాలనేది CM రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.