బాలీవుడ్ నటుడు గోవిందా జుహూలోని ఓ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పాడు. వర్కౌట్లు ఎక్కువగా చేయడం వల్ల అలసిపోయానని, వర్కౌట్ల కన్నా యోగా, ప్రాణాయామం లాంటివి చేయడం ఆరోగ్యానికి మంచిదని తెలిపాడు.