సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘నరసింహ'(పడయప్ప) మూవీ ఈ నెల 12న రీ-రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై రజినీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘నరసింహ 2’ ఉంటుందని, తాము దీనికి ‘నీలాంబరి’ అనే టైటిల్ లాక్ చేశామని చెప్పారు. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇక దివంగత నటి సౌందర్య, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ మూవీ 1999లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.