స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. ‘హనుమాన్’ తర్వాత పలు సినిమాలు చేస్తానని వర్మ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని చేయడం లేదన్నారు. ఆ సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద వర్మ రూ.100 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని, ఆయన చేస్తున్న సినిమాలను ఆపాలని డిమాండ్ చేశారు.