ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం ‘చెవాలియర్’కు ఆయన ఎంపికయ్యారు. చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్‌లో తరణికి రేపు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.