బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆయన్ను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ధర్మేంద్ర శ్వాసకోశ సమస్యలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స పొందుతూ ధర్మేంద్ర మరణించినట్లు వచ్చిన వార్తలను ఆయన కుమార్తె ఖండించారు.