సినీ నటి సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా రానా దగ్గుబాటి హాజరయ్యారు. ఆయన క్లాప్ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. యోగేష్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.