మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తోన్న సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. తాజాగా ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక UV క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ మూవీ 2025 జనవరి 10న విడుదల కానుంది.