పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ పాట పాడనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన చేత పాట పాడించడానికి స్కోప్ ఉన్నందున కీరవాణి పవన్‌తోనే పాడించాలని నిర్ణయించారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.