గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. దీపావళి కానుకగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు థమన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ టీజర్ వర్క్ చేస్తున్నట్లు తెలుపుతూ వెలుగుతున్న టపాసు ఎమోజీని పోస్ట్ చేశారు. దీంతో దీపావళికి టీజర్ రాబోతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది.