టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘విశ్వం’ మూవీ ఈ నెల 11న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.12 కోట్లకు కొనుగోలు చేసిందట. అక్టోబర్ 29 లేదా నవంబర్ 3న ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.