ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి ‘కాంతార’ సినిమాలో అద్భుత నటనకు గానూ జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా రిషబ్ జాతీయ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా తనకు మద్దతిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేశాడు. జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.