»Thats The Only Way Russia Can Stop The War In Ukraine
Vivek Ramaswamy: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే అదొక్కటే మార్గం
భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ప్రచారం కూడా మొదలుపెట్టారు.
Vivek Ramaswamy: భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటున్నారు. ఇటీవల ఆయన ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ టీవీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వివేక్ రామస్వామి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పై కీలకవ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దాన్ని ఆపాలంటే ముందు చైనాతో పుతిన్ స్నేహాన్ని తెగదెంపులు చేయాలని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా రష్యా- చైనా సైనిక కూటమితో అమెరికాకు ముప్పు పొంచి ఉందన్నారు. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే అదొక్కటే మార్గం. ముందు చైనాతో పుతిన్ స్నేహాన్ని కట్ చేయాలి. ఆ పని నేను కచ్చితంగా చేయగలనని నమ్ముతున్నాను. నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక వెంటనే మాస్కోలో పర్యటిస్తా. చైనాతో రష్యా దోస్తీని కట్ చేసేందుకు పుతిన్‌కు ఒప్పిస్తా. నా విదేశీ విధానాల్లో ఇదే మొదటిది. అయితే, ఈ మొత్తం ప్రాసెస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఓడించే లక్ష్యంతో కాకుండా అమెరికాను గెలిపించే లక్ష్యంతో ముందుకెళ్తాను. రష్యాను ఆపేందుకు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ఎంత సాయం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే. దీనివల్ల పుతిన్ చైనాకు మరింత దగ్గరవుతాడు’ అని వివేక్ తెలిపారు.
I will end the Ukraine War on terms that require Putin to exit his military alliance with China. The goal shouldn’t be for Russia to “lose.” It should be for the U.S. to *win.* https://t.co/pmsxaiFR2I