Changure Bangaru Raja: ‘ఛాంగురే బంగారు రాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
మాస్ మహారాజ రవితేజ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'ఛాంగురే బంగారు రాజా'. ఈ మూవీలో 'C/o కంచరపాలెం', 'నారప్ప' ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్నారు. గోల్డీ నిస్సీ హీరోయిన్గా పరిచయం అవుతోంది. సతీష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా హీరో శ్రీవిష్ణు, దర్శకులు హరీశ్ శంకర్, అనుదీప్ కేవీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.
అసలు సలార్ రిలీజ్ ఎప్పుడు? ఈ ఏడాదిలో ఉంటుందా? అనేది ప్రభాస్ ఫ్యాన్స్‌కు అంతుపట్టకుండా పోయింది. కానీ 'సలార్' ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒత్తిడికి గురవుతున్నాడట. రీ షూట్ కూడా చేస్తున్నాడట!