వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ చిత్రం 'అతిధి'. ఈ హర్రర్ థ్రిల్లర్ సిరీస్‌లో శియా గౌతమ్, అవంతిక మిశ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 19 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. అతిధి సిరీస్‌లో వెంకటేష్ కాకుమాను, రవి వర్మ, భద్రం, చాణక్య తేజ, గాయత్రి చాగంటి, పూజ వంటివారు నటిస్తున్నారు.
అసలు సలార్ రిలీజ్ ఎప్పుడు? ఈ ఏడాదిలో ఉంటుందా? అనేది ప్రభాస్ ఫ్యాన్స్‌కు అంతుపట్టకుండా పోయింది. కానీ 'సలార్' ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒత్తిడికి గురవుతున్నాడట. రీ షూట్ కూడా చేస్తున్నాడట!