బాలయ్య, ప్రభాస్ దెబ్బకు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి conversation ఎలా ఉంటుందో అనే ఎగ్జైటింగ్.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. ఆ సమయం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ షోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపిస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా ఈ షోలో చరణ్ కూడా సందడి చేసినట్టు తెలుస్తోంది. అన్ స్టాపబుల్2 ఎపిసోడ్లో ప్రభాస్, చరణ్ సంభాషణ హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ హింట్ ఇచ్చినట్టు.. అసలు ప్రభాస్, చరణ్ రాపో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం పక్కా అంటున్నారు. ప్రభాస్ మరియు గోపీచంద్‌తో పాటు బాలయ్యతో ఆన్ లైన్ ద్వారా చరణ్ మాట్లాడాడని తెలుస్తోంది. చరణ్, ప్రభాస్ మధ్య వీడియో కాల్ ఈ సీజన్‌కే హైలెట్ అంటున్నారు. అలాగే ఈ షో ద్వారానే చరణ్, ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అసలు మ్యాటర్ తెలియాలంటే.. ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కూడా శంకర్ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. దీని తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేయబోతున్నాడు. ఏదేమైనా అన్‌స్టాపబుల్ షోలో.. ప్రభాస్, గోపీచంద్, చరణ్‌తో కలిసి బాలయ్య రచ్చ రచ్చ చేశాడని చెప్పొచ్చు.