కార్తీకమాసం 22వ రోజు అష్టమితో కలిసి వచ్చింది కాబట్టి.. దీన్ని బుధాష్టమి అని పిలుస్తారు. ఇవాళ కాళభైరవుడికి ఎంతో ఇష్టమైన రోజు. శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి, రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతున్నామనుకునే వాళ్లు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని బాధపడే వాళ్లందరూ ఈ బుధాష్టమి సందర్భంగా మిరియాల దీపాన్ని వెలిగించాలి. మిరియాల దీపాన్ని శివాలయంలో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.