AP: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తుల వివరాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 30వ తేదీకి 57వేలు, 31వ తేదీకి 64వేలు, జనవరి 1వ తేదీకి 55 వేల టోకెన్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.