TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర కార్తిక మాసంతో పాటు ఆదివారం కావడంతో రద్దీ పెరిగింది. భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.