• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్రంథాలయాన్ని సందర్శించిన సర్పంచ్

BDK: టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు శుక్రవారం స్థానిక గ్రంధాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రంథాలయంలోని సౌకర్యాలు పరిసరాలు పరిశీలించారు. పుస్తకాల వివరాలను గ్రంథ పాలకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని వారికి సర్పంచ్ హామీ ఇచ్చారు. వారితోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 10:39 AM IST

సీఎం ప్రభుత్వం నిరుపేదలకే అందజేస్తుంది: MLA

RR: షాద్‌నగర్ పట్టణంలోని 17వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహాన్ని కట్టుకుని నేడు లబ్ధిదారులు పండగ చేసుకుంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలను నిరుపేదలకు అందజేస్తుందని పేర్కొన్నారు.

February 20, 2026 / 10:38 AM IST

‘ఓటరు అనుసంధానం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి’

ASF: కాగజ్ నగర్‌లో ఓటరు అనుసంధానం కార్యక్రమాన్ని బూత్ లెవెల్ అధికారులు గత నెల నుంచి నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఓటర్లు సహకరించాలని MRO మధుకర్ శుక్రవారం కోరారు. తమ వారసులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డు వివరాలు సేకరించి సంబంధిత BLOలకు అందజేయాలని ఆయన సూచించారు.

February 20, 2026 / 10:35 AM IST

న్యాయవాది సూర్యం మృతికి గాండ్ల సురేష్ నివాళి

BDK: మణుగూరు మండలం రాజుపేట గ్రామానికి చెందిన న్యాయవాది పగిడిపల్లి సూర్యం అనారోగ్యంతో నిన్న మృతి చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ సూర్యం భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 10:32 AM IST

‘ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’

KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్ రిహన కమల్ పాషాని శుక్రవారం సత్తుపల్లిలో 5 వ వార్డ్ కౌన్సిలర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమ దృష్టికి సమస్య వచ్చిన వెంటనే పరిష్కార దిశగా కృషి చేయాలని నూతన ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

February 20, 2026 / 10:31 AM IST

తాండూరు మార్కెట్ కమిటికి మహర్దశ

VKB: తాండూరు మార్కెట్ కమిటికి మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరిగిందని కమిటి ఛైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. తాండూరు మార్కెట్ కమిటికి రాజీనామా చేసిన పట్లోళ్ల బాల్ రెడ్డి గురువారం కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో రూ. 29 కోట్లతో 100 షాపులు, కవర్ షెడ్లు, సీసీ రోడ్లు, ప్రహారి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

February 20, 2026 / 10:29 AM IST

‘పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి’

NGKL: పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 14 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పీఎం శ్రీ స్కూల్స్ పథకం కింద జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న 22 యూనిట్ల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

February 20, 2026 / 10:29 AM IST

జేఈఈ మెయిన్స్‌లో గురుకుల విద్యార్థినుల జోరు

NLG: నల్గొండ జిల్లా గంధంవారిగూడెం SLBC గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మట్టిలో మాణిక్యాల్లా మెరిసిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపల్ లలితా కుమారి, వడ్డేపల్లి నాగరాజు గురువారం ఘనంగా సన్మానించారు. పట్టుదలతో శ్రమిస్తే అద్భుతాలు సాధించవచ్చని వారు ఈ సందర్భంగా విద్యార్థులను కొనియాడారు.

February 20, 2026 / 10:29 AM IST

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు

BDK: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై ఎన్ కౌంటర్ జరిగినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు. దండకారణ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని, అధికారికంగా తామే వెల్లడిస్తామని తెలిపారు.

February 20, 2026 / 10:27 AM IST

‘చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలి’

SDPT: జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో నిండుకున్న డ్రైనేజీలను మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి కొమరయ్య పారిశుద్ధ్య కార్మికులచే క్లీన్ చేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ప్రజలు చెత్త రోడ్లపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. ఈ మేరకు కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 10:26 AM IST

నాగన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి స్వల్ప గాయాలు

NZB: బోధన్ మండలం సాలురా ప్రధాన రహదారిపై నాగన్‌పల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో బాధితులను ఆసుపత్రికి తరలించారు.

February 20, 2026 / 10:24 AM IST

25 నుంచి EXAMS.. ఫోన్‌ కు హాల్ టికెట్స్

SRD: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింకులు పంపామని, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్స్ వద్ద కూడా వీటిని తీసుకోవచ్చన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

February 20, 2026 / 10:21 AM IST

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధికి కృషి

MNCL: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో మంచిర్యాల నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్ల విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా డివిజన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరుస్తామని, శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటుకు త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు.

February 20, 2026 / 10:20 AM IST

‘గరుడాచలం మృతి RSS, BJPకి తీరని లోటు’

ASF: RSS, వనవాసి కళ్యాణ పరిషత్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వాడపల్లి గరుడాచలం మృతి RSS, BJPకి తీరని లోటని MLA హరీష్ బాబు అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణం ఆదర్శనగర్‌లో గరుడాచలం అనారోగ్యంతో మృతి చెందారని తెలిసి ఆయన నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

February 20, 2026 / 10:15 AM IST

ముత్యంపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత

KMR: దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను గురువారం సాయంత్రం అధికారులు కూల్చి వేశారు. ఓ నాయకుడు గ్రామంలో అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు.అయినప్పటికీ హైకో ర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడాన్ని కూల్చివేయించారు.

February 20, 2026 / 10:15 AM IST